మరికొద్ది నెలల్లోనే అందుబాటులోకి తెలంగాణ నూతన సచివాలయం


నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి KCR పరిశీలించారు. సచివాలయ ప్రాంగణంలో పనుల గురించి ఇంజినీర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం అందంగా రూపుదిద్దుకుంటుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తెలిపారు. ఈ స‌చివాల‌యాన్ని మరి కొద్ది నెల‌ల్లోనే ప్రారంభిస్తామ‌ని ట్వీట్ చేశారు. నూత‌న స‌చివాల‌యానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరును ప్రభుత్వం పెట్టిన విష‌యం తెలిసిందే. 617 కోట్ల రూపాయల తో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో నిర్మిస్తున్నారు.