Site icon TeluguMirchi.com

తెలంగాణలో ‘భూమాత’ శాఖ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండవ సారి సీఎం అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. అందులో భాగంగా చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న రెవిన్యూ శాఖలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయిన సీఎం కేసీఆర్‌ రెవిన్యూ శాఖలో ఉన్న లోపాలను సరిదిద్దే ఆలోచనలు అడిగి తెలుసుకున్నారు.

ఇక రెవిన్యూ శాఖ అంటే ఎక్కువగా భూములకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అందుకే ఈ శాఖ పేరును మార్చి భూమాత శాఖగా నిర్ణయించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ఉత్వర్వులు కూడా జారీ చేసేందుకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భూమాత శాఖలో గతంలో మాదిరిగా ఇబ్బందులు లేకుండా రైతులు మరియు అన్ని వర్గాల వారు సులభంగా సేవలు అందుకునేలా ఉండబోతుంది. తెలంగాణలో సమగ్ర భూ సర్వే రికార్డుల ప్రక్షాళన అయ్యింది. అందుకే రెవిన్యూ శాఖను పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version