లాక్ డౌన్ సమయంలో రూల్స్ పాటించని వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేయడం తో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను జరిమానాలు విధించి తిరిగి ఇచ్చేయాలని ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చు.
వాహనదారులపై పెద్ద కేసులు ఉండే కోర్టుకే పంపనున్నారు. నిబంధనలు ఉల్లింఘించిన వాహనదారులకు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. అందులో ఉల్లంఘనలకు జరిమానా ఎలా చెల్లించాలో కూడా పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈసేవ/ మీసేవ/ పేటీఎం/టీఎస్‌ఆన్‌లైన్ లేదా https://echalan.tspolice.gov.in ద్వారా చెల్లించాలి.