తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టి ప్రజలకు కాస్త ఊరట కల్పించాయి. గత పది రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా..ఆదివారం 1873 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్షా 24,963 చేరింది. మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 31299గా ఉన్నాయి. వీరిలో 24,216 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు చూస్తే.. ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 51, జీహెచ్ఎంసీ 368, జగిత్యాల 77, జనగాం 34, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల్ 28, కామారెడ్డి 25, కరీంనగర్ 180, ఖమ్మం 103, ఆసిఫాబాద్ 21, మహబూబ్ నగర్ 40, మహబూబాబాద్ 54, మంచిర్యాల 48, మెదక్ 12, మేడ్చల్ 41, ములుగు 19, నాగర్ కర్నూల్ 36, నల్గొండ 79, నారాయణపేట 1, నిర్మల్ 4, నిజామాబాద్ 94, పెద్దపల్లి 29, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 129, సంగారెడ్డి 37, సిద్ధిపేట 85, సూర్యాపేట 65, వికారాబాద్ 15, వనపర్తి 32, వరంగల్ రూరల్ 19, వరంగల్ అర్బన్ 94, యదాద్రి భువనగిరిలో 21 కేసులు నమోదయ్యాయి.