Site icon TeluguMirchi.com

రేపటినుండి తెలంగాణలో భూముల విలువ పెంపు అమలు

తెలంగాణలో భూముల విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటినుంచి కొత్త విలువలు,చార్జీలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే 22వ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి స్లాట్‌ బుక్‌ చేసుకొని,స్టాంప్‌ డ్యూటీ చెల్లించినవారికి కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొన్నది.

ఇందుకోసం ధరణిలో ‘అడిషనల్‌ పేమెంట్స్‌ ఫర్‌ స్లాట్స్‌ ఆల్‌రెడీ బుక్డ్‌’ అనే అప్షన్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆప్షన్‌లోకి వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాలని సూచించింది. సందేహాల నివృత్తికోసం ప్రత్యేకంగా 18005994788 నంబర్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను మూడు శ్లాబులుగా పెంచారు. ఓపెన్‌ ప్లాట్ల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించారు.

Exit mobile version