ఇక లొల్లి ఢిల్లీలోనే.. !!

cabinet-meetingవిభజన బిల్లుపై ఒక అంకం ముగిసింది. టీ-బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ పాత్ర ముగిసింది. ఇక లొల్లి అంతా ఢిల్లీలోనే. బిల్లును రాష్ట్ర ఉభయ సభలు ముజువాణి ఓటుతో తిరస్కారం తెలిపిన విషయం తెలిసిందే. మిగిలింది.. పార్లమెంట్ పాత్రనే అన్న విషయం స్పష్టమైంది.

s-leadersఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇప్పుడు హస్తినా చేతిలో వుంది. ఏపీ సమైక్యంగా వుంచాలన్నా, విభజించాలన్నా అది కేంద్రానికి సాధ్యం. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర నేతలు ఢిల్లీ బాట పట్టారు. అసెంబ్లీలో ఐక్యత చాటిన సీమాంధ్ర నేతలు.. దానిని రాష్ట్రం సమైక్యంగా వుంటుందని ప్రకటన వచ్చే వరకు కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం పొందకుండా పావులు కదపాలని భావిస్తున్నారు.

t-leadersబిల్లు రాష్ట్రపతిని చేరేలోపు సీమాంధ్ర మంత్రు, ఎమ్మెల్యే హస్తినా చేరాలని నిర్ణయించారు. రాజ్ ఘూట్ వద్ద దీక్షకు దిగాలని కూడా యోచిస్తున్నారు. హస్తినా టూర్ కు సీఎం కిరణ్ ను ప్రాతినిధ్యం వహించాల్సిందిగా సీ-నేతలు కోరుతున్నారు. సమైక్య వాణిని వినిపిస్తున్న వైకాపా కూడా ఫిబ్రవరి 4న డిల్లీ చేరి తమ సీన్స్ ని చూపించాలని ఆరాటపడుతోంది.

మరోవైపు, టీ-నేతలు ఛలో హస్తినా అంటున్నారు. సీఎం డ్రామా ముగిసిందని.. ఇక టీ-ఖాయమని భరోసాగా చెబుతున్నారు. అయినా.. ఎందుకైనా తుది అంకం ముగిసే వరకు అప్రమత్తంగా వుండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని యోచిస్తున్నారు.

kcrఇక తెరాస నేత కేసీఆర్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ముఖ్యనేతలతో ఆయన హస్తినా టూర్ చేపట్టవచ్చు. జాతీయ నేతలను కలసి ’టీ’కి మద్దతు పలకాలని కోరటమే గులాబి అధినేత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రధాన పక్షమైన బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్ర నేతలను అందుబాటులో వుండాలని ఆదేశించినట్లు సమాచారం. మిగిలిన సీపీఐ, సీపీఎం, ఎంఐఎం లు ఢిల్లీ వెళ్లి తమ లొల్లిని మరోసారి వినిపించాలని ఫిక్స్ అయ్యాయి.

ఇలా అన్ని పార్టీలు దేశ రాజధానికి చేరడంతో… ఢిల్లీలో మరోసారి తెలంగాణ అంశం హాట్ టాపిక్ గా మారనుంది. రాష్ట్ర నేతల రాకతో హస్తినా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. హస్తినాలో గెలిచేదేవరు.. సమైక్యవాదులా.. ?? విభజన వాదులా.. ?? లేక హస్తిన ఆరాటమా.. ?? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఢిల్లీ లొల్లి అప్ డేట్స్ కోసం చూస్తునే వుండండి.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.