Site icon TeluguMirchi.com

తెలంగాణకు వ్యతిరేకం కాదట!

d-nagenderతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరుగా పిలవబడుతున్న మంత్రి దానం నాగేందర్ తెలిపారు. కేంద్రం త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందన్న నేపథ్యంలో దానం మాట్లాడుతూ… ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీమాంధ్ర నేతలు రాజీనామా నాటకాలాడుతున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా సామాజిక తెలంగాణ కావాలని ఆయన కోరారు.

హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చెస్తారనే వార్తలు వచ్చినందునే హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలిని డిమాండ్ చేసాము కాని, మరోటి కాదన్నారు. హైదరాబాద్ ప్రజలు తెలంగాణకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోబావాలకు అనుగుణంగానే కేంద్రంప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. లగడపాటి లాంటి వాళ్లు రెచ్చగొట్టినందువల్ల తెలంగాణ ఉద్యమం మరింత పెరిగిందన్నారు.

Exit mobile version