Site icon TeluguMirchi.com

తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,000 విద్యార్థులు ఉండగా, 1768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగనున్న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. గతేడాది కొవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ జరగలేదని.. కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Exit mobile version