కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ


కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఫోర్జరీ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) దర్యాప్తుపై స్టే కోరిన కృష్ణయ్యతో పాటు, ఇతర సహనిందితులకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కృష్ణయ్యతో పాటు, లోటస్ హాస్పిటల్ యజమానులు, హేమా మాలిని భర్త వి.ఎస్.వి. ప్రసాద్ కూడా నిందితులుగా ఉన్నారు. కేసు దర్యాప్తు ప్రక్రియను మీడియా, సోషల్ మీడియా వేదికలపై ప్రసారం చేయకూడదని నిందితులు విజ్ఞప్తి చేశారు. అయితే, హైకోర్టు ఈ అభ్యర్థనను సునిశితంగా తిరస్కరించింది. అంతేకాక, ఈ కేసును సైబరాబాద్ నుండి హైదరాబాద్‌కు బదిలీ చేయడాన్ని సవాలు చేసిన నిందితులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.