తెలంగాణ లో వీఆర్వో వ్యవస్థ రద్దు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు. నేటి మధ్యాహ్నమే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు సీఎస్‌ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి అన్నిరకాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టాంపుల కొనుగోలు, చ‌లాన్లు చెల్లించిన వారికి ఇవాళ రిజిస్ర్టేష‌న్లు అవుతాయ‌ని రిజిస్ర్టేష‌న్లు, స్టాంపుల శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు ప్ర‌క‌టించారు. నేటి నుంచి స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ర్టేష‌న్లు ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం దృష్ట్యా ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రిజిస్ర్టేష‌న్లు నిలిపివేశామ‌ని చిరంజీవులు తెలిపారు. అలాగే తెలంగాణలోని రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.