Site icon TeluguMirchi.com

కోటి వాక్సిన్ లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, కేక్ కట్ చేసిన సిఎస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ కార్యాలయంలో, రాష్టంలో ఈ రోజు వరకు కోటి మందికి టీకా వేయడం పూర్తియైన సందర్భంగా కేక్ కట్ చేసి ఆరోగ్య శాఖ అధికారులను,ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని, ఆశావర్కర్లను అభినందించారు. ఈ సందర్భంగా మోబైల్ వ్యాక్సిన్ వ్యాన్ ను ప్రారంభించారు. అదేవిధంగా వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నేడు చారిత్రాత్మకమైన రోజు అని , ఈ రోజువరకు రాష్ట్రంలో 1 కోటి టీకాలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఒక పద్దతిలో ప్రణాళికాయుతంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ తో ప్రారంభించి హై రిస్క్ గ్రూపు, సూపర్ స్ర్పేడర్లును ముందస్తు గా గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వడం వలన సమర్ధవంతంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టగలిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల మందికి కోవిడ్ టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే, ఒక కోటి మైలురాయిని అధిగమించినట్లు తెలిపారు. వారిలో 26 లక్షల మంది సూపర్ స్ర్పేడర్లకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ క్యాటగిరిలలో మిగిలిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకాలు ఇచ్చుటకై 30 మోబైల్ వాహనాల ద్వారా పని ప్రదేశాలలోనే టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆదే విధంగా టీచర్లకు కూడా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version