తెలంగాణ రాష్ట్ర సర్కార్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల (జేపీఎస్) ప్రొబేషన్ టైమ్, జీతాలను రూ.15 వేలు నుండి రూ.28,719కి పెంచింది. అంతే కాదు ప్రస్తుతం రెండేళ్లుగా ఉన్న ప్రొబేషన్‌ను నాలుగేండ్లకు పెంచి వారిలో సంతోషాన్ని నింపింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త జీతాలు జులై 1 నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019 ఏప్రిల్ లో భర్తీ చేసింది. అప్పుడు వారి ప్రొబేషన్ టైమ్ ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. ఈ ప్రొబేషన్ టైమ్ కూడా పూర్తయి 2 నెలలు గడవం తో ఇప్పుడు వారి జీతం తో ప్రొబేషన్‌ను కూడా పెంచింది.