రైతులకు తెలంగాణ సర్కారు తీపి కబురు.. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్


2023–2024 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం తరుపున రాష్ట్ర బడ్జెట్ ను ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. ఇక తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు.

ఇక రాష్ట్రంలో రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.సరిగ్గా ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావటంతో దాదాపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగించడం జరిగింది. ఈ క్రమంలో రైతు రుణమాఫీ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే…

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు,
వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233
విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
రైతు బంధు పథకంకు రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకంకు రూ. 1,589 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంకు రూ. 200 కోట్లు
ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
ఉన్నత విద్యాశాఖకు రూ. 3001 కోట్లు
న్యాయశాఖకు రూ. 1665 కోట్లు