తెలంగాణ లోని 19 జిల్లాల్లో ఈ నెల 7వ తేదీన డయాగ్నాస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 19 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటుచేయబోయే డయాగ్నాస్టిక్ సేవలు సోమవారం నుండి అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల్లో నెలకొన్న కోవిడ్ పరిస్థితిపై ప్రగతిభవన్ లో సమీక్షా నిర్వహించారు. కొత్తగా ఏర్పాటుచేసే డయాగ్నాస్టిక్ కేంద్రాల్లో 55రకాల వైద్యపరీక్షలను ఉచితంగాచేయనున్నట్లు, వివిధ పథకాలద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నట్లు చెప్పారు.