సమరానికి సై..!!

Assemblyటీ-బిల్లును తిరస్కరిస్తూనే.. దానిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయరాదని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసే తీర్మాణాన్ని ప్రభుత్వం తరుపున శాసనసభలో ముఖ్యమంత్రి తీర్మాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సీఎం తీర్మాణానికి మద్దతుగా సీమాంధ్ర నేతలు, వ్యతిరేకంగా టీ-నేతలు కత్తులు దూసుకుంటున్నారు.

ఇపటికే ముఖ్యమంత్రి తీర్మాణాన్ని పరిగణలోనికి తీసుకోరాదని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా, కాంగ్రెస్ నేతలు స్వీకర్ ను కలసి విజ్ఞప్తి చేసారు. ఇక తెరాస ఆర్టికల్ 81కింద ఇవాళ స్వీకర్ కు నోటీసు ఇవ్వనున్నారు. మరోవైపు, ఎలాగైనా.. టీ-బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టాలని.. అందులో విజయం సాధించాలని సీమాంధ్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి.. ఇరు ప్రాంతాల వారు సమరానికి సై అనే విధంగా సన్నిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇకపై సభ సజావుగా సాగడం ప్రశార్థకమే.

టీ-బిల్లుపై ఇప్పటికే.. 87 మంది సభ్యులు మాట్లాడారు. మరికొందరు.. చర్చలో భాగస్వామ్యం అయ్యారు. ఇక మిగిలిన ముఖ్యులలో.. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం దామోదర, మంత్రులు ఆనం, రఘువీరా వున్నారు. అయితే, సభ సజావుగా సాగితే.. ఈరోజు చంద్రబాబు, దామోదర మాట్లాడే అవకాశం వుంది. టీ-బిల్లును తిప్పిపంపే తీర్మాణంపై సీమాంధ్ర నేతలు ఏమాత్రం పట్టుబట్టిన.. దానికి ప్రతిగా నేతలు సభను సాగకుండా అడ్డుకునే పరిస్థితి వుంది. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా అసలైన.. రాజకీయ ఎత్తుగడలు చూడనున్నామన్న మాట.