Site icon TeluguMirchi.com

కరోనా నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ సియస్

రాష్ట్రంలో కోవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని, జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. మాస్కులు ధరించడం, కోవిడ్ ను ఎదుర్కొనే విషయమై ప్రభుత్వం జారీచేసిన సూచనలను, ఆదేశాలను ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M. రిజ్వీ, సలహాదారు టి. గంగాధర్, సంచాలకులు ప్రీతి మీనా (డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్), డా. రమేశ్ రెడ్డి (మెడికల్ ఎడ్యుకేషన్), శ్రీనివాస్ రావు (పబ్లిక్ హెల్త్), తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version