తెలంగాణ లో కరోనా మహమ్మారి అస్సలు తగ్గడం లేదు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని కఠిన శిక్షలు , ఆంక్షలు విదిస్తున్నప్పటికీ మాయదారి మహమ్మారి మాత్రం బుసలు కొడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73, 050కి చేరింది. ఇందులో 20,358 యాక్టివ్ కేసులు ఉండగా.. 52,103 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1289 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 13 మంది మరణించారు.

ఇది జిల్లా వారీగా కేసులు చూస్తే ..

ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 36, జీహెచ్ఎంసీ 535, జగిత్యాల 28, జనగాం 26, జయశంకర్ భూపాలపల్లి 21, గద్వాల్ 72, కామారెడ్డి 28, కరీంనగర్ 123, ఖమ్మం 64, మహబూబ్ నగర్ 48, మహబూబాబాద్ 16, మంచిర్యాల 43, మెదక్ 18, మేడ్చల్ 126, ములుగు 27, నాగర్ కర్నూల్ 22, నల్గొండ 52, నారాయణపేట 6, నిర్మల్ 25, నిజామాబాద్ 91, పెద్దపల్లి 54, రాజన్న సిరిసిల్ల 83, రంగారెడ్డి 169, సంగారెడ్డి 101, సిద్ధిపేట 20, సూర్యాపేట 34, వికారాబాద్ 9, వనపర్తి 34, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 128, యదాద్రి భోనగిరిలో 12 కేసులు నమోదయ్యాయి.