తెలంగాణలో మళ్ళీ రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 528 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 8,05,665 కేసులు నమోదు అయ్యాయి. 5189 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 4111 మంది మరణించారు. తెలంగాణ లో ఈ రోజు 485 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 327, రంగారెడ్డి లో 52 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 39 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.