దసరా తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, త్వరలోనే కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ కోసం పలువురు ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. హరీష్ రావుకు మంత్రి పదవి దక్కక పోవడంతో ఆయన వర్గం చాలా కోపంతో ఉంది. ఇలాంటి సమయంలో మంత్రి వర్గ విస్తరణ చేసి హరీష్ వర్గంను చల్లార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తాడా లేదంటే మా వేడి మరింత రాజేస్తాడా అనేది చూడాలి. ఇక కేటీఆర్‌కు కూడా మంత్రి పదవి దక్కేనా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. కేటీఆర్‌ను పూర్తిగా పార్టీకే కేటాయించాలని కేసీఆర్ భావిస్తే అప్పుడు మంత్రి అయ్యే అవకాశం లేదు. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. అక్టోబర్ రెండవ లేదా మూడవ వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.