తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే అంటే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేయగా, మండలిలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రజెంట్ చేయబోతున్నారు. గతంలో కీలకమైన నీటి పారుదల శాఖను నిర్వహించిన హరీష్ రావు ఈసారి ఆర్ధిక మంత్రిగా తన ముద్రను వేయబోతున్నాడు. బడ్జెట్ కేటాయింపుల్లో హరీష్ రావు కల్పించుకోలేదు. ఎందుకంటే నిన్ననే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తన ప్రమేయం లేకుండా తయారైన బడ్జెట్‌ను హరీష్ రావు చదవబోతున్నాడు. అయితే హరీష్ రావు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్ధిక మంత్రిగా తన శాఖపై ముద్ర వేస్తాడనే టాక్ వస్తుంది. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్‌లు అయిన నీటి పారుదల మరియు వ్యవసాయంకు భారీ ఎత్తున ఈ బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కూడా భారీగానే కేటాయించారు. బడ్జెట్ పూర్తి సమాచారం మరికాసేపట్లో మీ ముందుకు తీసుకు వస్తాం.