Site icon TeluguMirchi.com

శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ’టీ’ బిల్లు !

shinde1రాష్ట్ర విభజనపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు జీవోఎం చర్చలు జరుపుతూనే..మరోవైపు, వచ్చే శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ’టీ’-బిల్లు వస్తుందని కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న ఢిల్లీలో వెల్లడించారు. గతంలో.. యూపీఏ-2 హయాంలో తెలంగాణ ప్రక్రియ ముగుస్తుందని చెప్పగలనని.. కానీ వచ్చే శీతాకాల సమావేశంలో వస్తుందన్ని గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. అయితే, తాజా షిండే ప్రకటన వెనక అధిష్టానం ఒత్తిడి వుందని తెలుస్తోంది. అధిష్టానం ఆదేశంతోనే షిండే వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీ-బిల్లు వస్తుందని ప్రకటించినట్లు విశ్వసనీయ సమాచారం.

’టీ’బిల్లుపై ప్రకటనైతే.. చేశారు కానీ ఇంకా ప్రసెస్ మాత్రం పూర్తికాలేదు. జీవోఎంకు అన్ని శాఖల నుంచి ఖచ్చితమైన సమాచారం రావాలి. అయినా.. అధిష్టానం వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు వస్తొందని చెప్పడం విశేషం. దీన్నిబట్టి చెప్పవచ్చు కాంగ్రెస్ అధిష్టానం విభజన అంశాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుతుందో. ఎంతయినా రాజకీయ అవసరం కదా.. ! మరీ ఎప్పటిలాగే.. షిండే నుండి మరో ప్రకటన వస్తుందా.. ? లేదా ఆయన ప్రకటించినట్లుగా.. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో టీ-బిల్లు పార్మమెంట్ కు వస్తుందా అనేది వేచి చూడాలి.

Exit mobile version