Site icon TeluguMirchi.com

ముహూర్తం నేడే!!

lok-sabha_398_080911043849రాష్ట్ర విభజన అంశం ఆఖరు అంకానికి చేరుకొంది. నిరసనలు, ఆవేదనలు, ఆక్రోశాల మధ్య నేడు బిల్లు లోక్ సభ ముందుకు రానుంది. ఏం జరుగుతుందా..? అని అందరూ మునివేళ్లపై నిలబడి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సభలో ప్రవేశపెట్టడానికి భాజాపా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. బిల్లు పాస్ కావడానికి ఎంత వరకు సహకరిస్తుంది..?? అన్నది చెప్పలేం.

ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 12గంటలకు బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు సైతం దృవీకరించాయి. సీమాంధ్ర ఎంపీల హెచ్చరికల నేపథ్యంలో.. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు స్వీకర్ మార్షల్స్ ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, బిల్లును అడ్డుకోవడానికి అవసరమైతే.. ఏ స్థాయికైనా వెళ్లాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అధినేత్రి ఆజ్ఞను ఏమాత్రం ఖాతరు చేయకుండా నిన్న లోక్ సభలో చేసిన ఆందోళన మాదిరిగానే నేడు విజృంభించాలని మంత్రులు నిర్ణయించారు. ఇక టీ-నేతలు మాత్రం లోక్ సభలో ఈరోజే బిల్లు పాసవుతుందన్న ధీమాతో వున్నారు.

ఈ నేపథ్యంలో.. లోక్ సభలో చోటుచేసుకోనున్న పరిణామాలపై ఇటు రాజకీయ నాయకులతో పాటుగా, సామాన్య ప్రజానీకం సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బిల్లుపాసవుతుందా.. ? ’టీ’కి భాజాపా మద్ధతు పలుకుతుందా..?? ఎవరు ఎవరిపై ఫైర్ అయ్యారు.. ? తదితర విషయాలు తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే..

Exit mobile version