ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 ఉన్నాయి. వాటిని 153 కు పెంచనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పెంపు వెనుక బీజేపీ రాజకీయ కోణం కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంతో పోల్చితే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం లేదా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదంటే నెం.2 గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే సీట్లను పెంచడం జరిగింది. సీట్లను పెంచిన తర్వాత కొత్త స్థానాల్లో బీజేపీ వారికి పాజిటివ్ బజ్ ఉంటుంది.
అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఖచ్చితంగా 50 సీట్లయినా బీజేపీ సాధిస్తుందని, అప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు అనే ఉద్దేశ్యంతో బీజేపీ సీట్ల పెంపుకు సిద్దం అయ్యిందనే వాదన వినిపిస్తుంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వరకు అసెంబ్లీ స్థానాల పెంపు పక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.