వందేళ్ల చరిత్ర ఉన్న ఉన్న అసెంబ్లీ భవనం పైకప్పు కూలింది. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ భవనం తూర్పు వైపు ఎలివేషన్ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కూలింది. దీంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది అక్కడకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో దీని నిర్మాణం ప్రారంభించారు. ప్రజలు ఇచ్చిన చందాలతో గతంలో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం.
ప్రస్తుతం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సెక్రటేరియట్, ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు.