ఇతర రాష్ర్టాలతో తెలంగాణను ముడిపెట్టరాదు

Telangana-and-small-states-demand-are-separate-says-Cong-High-commandతెలంగాణ సమస్యకు, దేశంలోని ఇతర రాష్ర్టాల ఏర్పాటు అంశాలకు ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ…. ’ఇది సున్నితమైన విషయమైనందున.. తెలంగాణకు, ఇతర ప్రాంతాల్లోని ప్రత్యేక రాష్ర్టాల ఏర్పాటు అంశాలకు ముడిపెట్టొద్దనీ, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో అపార్థాలు తలెత్తుతాయని’ పేర్కొన్నారు. మరో వైపు అఖిల పక్షంలో చెప్పిన గడువులోగా తెలంగాణ ఏర్పడుతుందనే విషయంలో తాను తమపార్టీని ఎంతమాత్రం నమ్మబోనని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. అఖిలపక్షం బోగస్ అనీ, అందులో తమ డిమాండ్ కు పరిష్కారం దొరకదనీ కేకే విమర్శించారు.