తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల లోపు క్యూలో నిలబడిన వారికి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 63.94 శాతం ఓటింగ్ నమోదైంది. అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని పలు సంస్థలు పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉంటే.. ఫలితాలు తేలాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.
AGENCY | INC | BRS | BJP | AIMIM | OTHERS |
సీఎన్‌ఎన్ ఎగ్జిట్ పోల్స్ | 56 | 48 | 10 | 5 | 0 |
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ | 56 | 48 | 10 | 5 | 0 |
ఆరా ఎగ్జిట్ పోల్స్ | 58-67 | 41-49 | 5-7 | 0 | 7-9 |
అగ్ని న్యూస్ ఎగ్జిట్ పోల్స్ | 62-66 | 43-47 | 2-5 | 5-7 | 0 |
సునీల్ వీర్ అండ్ టీమ్ ఎగ్జిట్‌పోల్స్ | 28 | 68-72 | 10-11 | 6 | 0 |
సీ-ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ | 65 | 41 | 4 | 0 | 9 |
పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ | 37-38 | 69-71 | 03-05 | 06 | 01 |
చాణక్య స్ట్రాటజీస్ | 67-78 | 22-30 | 06-09 | 06-07 | 00 |