తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం తాలూకా కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసారు. గత నాల్గు రోజులుగా రెండు వేలకు పైగా నమోదు అవుతూ వస్తున్న కేసులు..ఆదివారం కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,842 కరోనా పాజిటివ్కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,091 పాజిటివ్కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఆరుగురు మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 761కు చేరింది.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు చూస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 373, రంగారెడ్డి జిల్లాలో 109, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 37, ఖమ్మంలో 77, వరంగల్ అర్బన్ జిల్లాలో 74, వరంగల్ గ్రామీణ జిల్లాలో 8 చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో 37, జగిత్యాల జిల్లాలో 70, జనగామా జిల్లాలో 24, జోగుళాంబా గద్వాల జిల్లాలో 33, నల్గొండ జిల్లాల్లో 47, కామారెడ్డి జిల్లాల్లో 20, సిద్దిపేట జిల్లాల్లో 50, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 13, పెద్దపల్లి జిల్లాల్లో 44, సూర్యాపేట జిల్లాల్లో 113, నిజమాబాద్ 158, మహబూబాబాద్ జిల్లాల్లో 64, మహబూబ్నగర్ జిల్లాలో 42, నారాయణపేట జిల్లాలో 4, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 13, ములుగు జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో 10, సంగారెడ్డి జిల్లాలో 50, వికారాబాద్ జిల్లాలో 11, వనపర్తి జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 14, నాగర్కర్నూల్ జిల్లాలో 32, మంచిర్యాల జిల్లాలో 59, కరీంనగర్ జిల్లాలో 134, కామారెడ్డి జిల్లాలో 20, భూపాలపల్లి జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 70, ఆదిలాబాద్ జిల్లాలో 23 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.