Site icon TeluguMirchi.com

శనివారం (ఆగష్టు 29) తెలంగాణ కరోనా కేసుల రిపోర్ట్

ప్రతి రోజు లాగానే శనివారం సైతం తెలంగాణ ఆరోగ్య శాఖా కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో 2,751 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది. ఈ కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా తో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 808కి చేరుకుంది. తాజాగా 1,675 మంది వైరస్‌ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 89,350 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 30,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

తాజాగా నమోదైన 2,751 పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో 432, కరీంనగర్‌ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్‌ 133, సూర్యాపేఏట 111, వరంగల్‌ అర్బన్‌ 101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Exit mobile version