Site icon TeluguMirchi.com

కరోనా కట్టడికి ఇలాంటి ప్రయోగం దేశంలో ఇదే తొలిసారి

కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు అమలుచేయని విధంగా ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి సర్వే చేపించి కరోనా లక్షణాలున్న వారికి వైద్యసలహాలు, ప్రాథమిక చికిత్స, మందుల పంపిణీ తక్షణం చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. విహెచ్సి , ప్రభుత్వ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ ల సేవలు ప్రారంభించింది. కరోనా లక్షణాలు ఉంటె వెంటనే వెంటనే కరోనా కిట్ అందచేసి నిత్యం ఫోన్ లో మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాల్లో ఆర్టిపీసిఆర్ లాబ్స్ లు, ఆక్సిజన్ బెడ్స్ పెంచారు.

Exit mobile version