తనను గెలిపిస్తే చట్ట సభల్లో పేదోళ్లు, నిరుద్యోగుల గొంతుకనవుతానని హామీ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. మాట నిలుపుకోకుంటే రెండున్నరేండ్లలో రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పాదయాత్రను జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ తనకు పదవులు ముఖ్యం కాదని, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించడం కోసమే పోరాటం చేస్తున్నానన్నారు. చనిపోయే ముందు తన ఒంటిపై బట్టలే ఆస్తులుగా ఉండాలని, బతికినన్ని రోజులు మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు.
ఖమ్మం– వరంగల్– నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. ఈ పాదయాత్ర ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో 50 రోజుల్లో 1,600 కిలోమీటర్ల పైన జరగనుంది.