Site icon TeluguMirchi.com

పంచాయితీ పోరులో టిడిపి టాప్ !

panchayat-electionsతెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రమక్రమంగా పుంజుకుంటూ.. పూర్వవైభవం వైపు పాగ వేయడానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ఊరిపోరులో టిడిపి టాప్ గేర్ లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగనున్న పోలింగ్ కు ముందే తెదేపా బలపర్చిన అభ్యుర్థులు ప్రస్తుతానికి మెజార్టీ పంచాయితీల్లో పాగా వేశారు. తాము బలపర్చిన అభ్యర్థులను గెలుపించుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలపై  పోలింగ్ కు ముందే స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చింది. దీంతో.. తెలుగు తమ్ముళ్లు ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పట్టు సాధించడం ద్వారా.. వచ్చే సాధారణ ఎన్నికల్లో అసాధారణ మెజార్టీతో దూసుకెళ్లాలని తెలుగుతమ్ముళ్లు భావిస్తున్నారు.

మొత్తం ఇప్పటివరకు 1219 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెదేపా మద్ధతిచ్చిన ఏకగ్రీవ అభ్యర్థులు 457, కాంగ్రెస్ 240, జగన్ పార్టీ 142, తెరాస 36, సీపీఎం 6, సీపీఐ 2, భాజపా  2, న్యూడెమోక్రసీ 12. పంచాయితీ ఎన్నికల ఫలితాలకు ముందే తెదేపా ప్రభంజనం మొదలవడంతో.. పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చిందని ఆ పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.

జిల్లాల వారీగా వివిధ పార్టీ అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికైన వివరాలు : 

 

 

 

Exit mobile version