Site icon TeluguMirchi.com

టీడీపీ తెలంగాణకు అనుకూలమేనన్న కడియం, రావుల

kadiya-srihar-kcrటీడీపీ తెలంగాణకు అనుకూలమనే డిసెంబర్‌ 28న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చెప్పిందని ఆపార్టీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ రిజిస్ట్రీలో కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ లోని ఈ విషయాన్ని నమోదు చేసిందని టీడీపీ నేతలు కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇది ఓర్వలేని తెలంగాణా రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా లేనిపోని వాదనలతో ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హోంశాఖ నమోదు చేసిన మినిట్స్ తెప్పించాలని సవాల్ విసిరారు. అందులో ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేమని తేలితే తాము ఏ శిక్షకైనా సిద్ధమని తెదేపా నేతలు కడియం, రావుల పేర్కొన్నారు.

Exit mobile version