తెదేపా అధినేతగా బాబు..!

cbnతెదేపా అధినేత చంద్రబాబు నాయుడేనండీ.. కాకపోతే ప్రతి సంవత్సరం పార్టీ మహానాడులో అధ్యక్షుడిని ఎన్నుకోవడం తెదేపా ఆనవాయితి. మరి ఈసారి కూడా పార్టీ అధినేతగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ..  24 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఆ పార్టీ నేత కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గండిపేటలో రెండు రోజుల పాటు జరుగుతున్న మహానాడులో రేపు సాయంత్రం 5 గంటలకు పార్టీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు కేఈ వెల్లడించారు. పాత అధ్యక్షుడే అయినా.. మరోసారి కొత్తగా ఎన్నుకోనున్నారన్న మాట!