జగన్ ఇలాకలో తెదేపా ప్రజాగర్జన!

tdp-prajagarjana

ఎన్నికల ప్రచారంలో తెదేపా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు చోట్ల ప్రజాగర్జనను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా, జగన్ ఇలాక అయినా కడపలో తెలుగు తముళ్లు గర్జించనున్నారు. ఈరోజు సాయంత్రం కడపలో తెదేపా ప్రజాగర్జన ప్రారంభం కానుంది. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి కడప బయలుదేరారు. అయితే, సీమాంధ్ర ఎన్నికల సమరంలో ప్రధానంగా పోటీపడే పార్టీలు తెదేపా – వైకాపా తేలిపోయింది. ఈ నేపథ్యంలో.. జగన్ సొంత జిల్లా అయిన కడపలో తెదేపా తలపెట్టిన ప్రజాగర్జన మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. కాగా, కపడ ప్రజాగర్జనకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.