Site icon TeluguMirchi.com

ఒక రోజు ముందే టీడీపీ ఎంపీల రాజీనామా

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తమ ఎంపీు ఏప్రిల్‌ 6న రాజీనామా చేస్తారు అంటూ జగన్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. ఎంపీలు ఇప్పటికే కేంద్రంలో ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాలు పూర్తి అయిన తర్వాత కేంద్రం ఈ విషయమై ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా రాజీనామాలు చేసి తీరుతాం అంటూ వైకాపా ఎంపీలు పట్టుబట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా రాజీనామాలకు సై అంటోంది. ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.

ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైకాపా కంటే ఒక్క రోజు ముందే అంటే ఏప్రిల్‌ 5వ తారీకున తమ ఎంపీలు రాజీనామా చేస్తారు అంటూ ప్రకటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదినారాయణ రెడ్డి ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ తరపున చేసినవా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక వైపు పవన్‌ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తున్న సమయంలో వైకాపా మరియు టీడీపీలు ఇలా ఎంపీల రాజీనామా దిశగా వెళ్తున్న నేపథ్యంలో అంతా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం అనే నమ్మకం పెట్టుకున్నారు.

Exit mobile version