తెదేపా ఎమ్మెల్యేల రాజీనామా!

tdpవిభజనకు నిరసనగా నేతల రాజీనామాలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కొంతమంది సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తెదేపా ఎమ్మెల్యేలు గాలి ముద్దు కృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, రామకృష్ణ.. తదితరులు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలను ఫ్యాక్స్ ద్వారా స్వీకర్ కు పంపినట్లు నేతలు తెలిపారు.