తెదేపా ఎమ్మెల్యేల దీక్ష భగ్నం

tdp-niravadika-nirahara-deeవిద్యుత్ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్థ రాత్రి పోలీసులు భంగం చేశారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష కారణంగా పలువురి నేతల ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో.. పోలీసులు రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం స్వీకర్ అనుమతితో శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో.. పోలీసులు తెదేపా అదుపులోనికి తీసుకొని.. నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అరెస్ట్ సమయంలో ప్రతిఘటించిన తెలుగు తమ్ముళ్లను పోలీసులు చెదరగొట్టినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. తెదేపా సీనియర్ నేట మోత్కుపల్లి మాట్లాడుతూ.. ప్రజా సమస్యపై దీక్షకు దిగిన నాయకులను అర్థవేళ అమానుషంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆస్పత్రిలో కూడా దీక్షలు కొనసాగిస్తామని తెదేపా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై ప్రజాసామ్యబద్దంగా తెదేపా నేతలు చేస్తున్న దీక్షను ప్రభుత్వం అర్థవేళ అమానుషంగా భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఈరోజు (శనివారం) అన్ని మండల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి.

అయితే గత నాలుగురోజులుగా తెదేపా చెందిన 25 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎంపీ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్న సంగతి తెలిసిందే. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి శుక్రవారం సాయంత్రానికి విషమించడంతో.. ప్రభుత్వం తెదేపా నాయకులను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.