Site icon TeluguMirchi.com

రేవంత్‌ రెడ్డి ముందున్నది ఒక్కటే

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ తెలంగాణలో మాత్రం అవసాన దశలో ఉందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలు పలువురు టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో మిగిలిన సీనియర్‌ నాయకుడు ఒక్క రేవంత్‌ రెడ్డి మాత్రమే. అధినేత లేని ప్రాంతీయ పార్టీ నడవడం కష్టమే. తెలంగాణలో అధినేత లేకపోవడం వల్ల పార్టీని పూర్వ వైభవంకు ఏ ఒక్కరు తీసుకు రాలేరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

పార్టీ ఇక తెలంగాణలో పుంజుకోవడం కష్టం అనే నిర్ణయానికి వచ్చిన రేవంత్‌ రెడ్డి సైతం పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో రేవంత్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ నుండి ఆహ్వానం దక్కింది. కాని ఆ ఆహ్వానం కాదని, టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై సంచలన స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఆ కారణంగా సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి అంటే మహా కోపం.

టీఆర్‌ఎస్‌ పార్టీ తనను ఓటుకు నోటు కేసులో ఇరికించిందని కూడా రేవంత్‌ రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. అందుకే రేవంత్‌ రెడ్డి బీజేపీలో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. రేవంత్‌ రెడ్డికి బీజేపీ తప్ప మరే దిక్కు లేదు.

Exit mobile version