సర్వే తర్వాత వైకాపా వైపు తెలుగు తమ్ముళ్ల చూపు

ఏపీలో తెలుగు దేశం పార్టీపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత కారణంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి కష్టాలు తప్పవు అంటూ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ రిపబ్లిక్‌ మరియు సి ఓటర్‌ నిర్వహించిన సర్వేలో వెళ్లడైంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, ప్రజలు చంద్రబాబు నుండి ఆశించింది పొందలేక పోయాం అని భావిస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. 2019లో ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుండే వైకాపాతో చర్చలు జరిపేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

దాదాపు ముగ్గురు టీడీపీ ఎంపీలు ఇప్పటికే వైకాపాలో జాయిన్‌ అవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కారణంగా నిర్ణయాన్ని వెళ్లడి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంకు ఆ విషయం ఇప్పటికే లీక్‌ అయ్యిందని, వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఎంపీలు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా వైకాపా వైపు మొగ్గు చూపుతారంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఏపీలో టీడీపీ 2019 ఎన్నికలు చాలా అంటే చాలా క్లిష్టం అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.