కొత్త ఆలోచనలు-విన్నూత ప్రయోగాలు తెదేపాకే సాధ్యం : బాబు

cbn(3)కొత్త ఆలోచనలు – విన్యూత ప్రయోగాలు చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. యువతకు ఉద్యోగాలు రావాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగులేయాలన్న రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావాల్సిందే. ఈ వ్యాఖ్యలు చేసేంది ఎవరో ఇప్పటికే మీకు అర్థమయి వుంటుంది. అవునూ… తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. నిన్న(శుక్రవారం) కర్నూలులో జరిగిన తెదేపా ’ప్రజాగర్జన సభ’లో చంద్రబాబు ఆకట్టుకునే ప్రసంగం చేశారు.

రాష్ట్రంలో సుస్థిరపాలన పాలన నెలకొనాలని, అందుకే తెదేపా అధికారంలోనికి రావడం చారిత్రాత్మక అవసరమని బాబు అన్నారు. ఇక, తెదేపా అధికారంలోనికి వస్తే.. రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతాలు, ఆటో కార్మికులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని బాబు హామి ఇచ్చారు. అభివృద్దియే ప్రధాన లక్ష్యంగా తెదేపా అలుపెరగకుండా కృషి చేస్తుందని బాబు తెలిపారు.

ప్రజార్జన సాక్షిగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శణా బాణాలను ఎక్కుపెట్టారు. తెలుగుజాతి కడుపుకొట్టిన సోనియా.. గాంధీ కాదని గాడ్సే అని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఈసారి బాబు ప్రసంగంలో స్పష్టమైన మార్పు కనిపించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. తెలుగుజాతి ఎదుర్కొంటున్న సమస్యలు, సీమాంధ్ర అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ..బాబు ఆమాంతం ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.