Site icon TeluguMirchi.com

నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ టీడీపీ ప్లెక్సీ

తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం రావాలంటే జూ. ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిందే అని అభిమానులు , కార్య కర్తలు చెప్పడమే కాదు సాక్ష్యాత్తు తెలుగుదేశం నేతలు కూడా చెపుతున్నమాట. కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. అందుకే పార్టీ కి తనకు ఏ సంబంధం లేదు అన్నట్లు తన సినిమాలతో బిజీ గా ఉంటున్నాడు. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ పేరు ఎక్కడ బయటకు రావడం లేదు.

ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ జిల్లాలోని యెర్రగొండపాలెంలో టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీ పెట్టారు. అందులో జిల్లా టీడీపీ నేతలతో పాటు ఎన్టీఆర్ కు స్థానం కల్పించారు. అక్కడితో ఆగకుండా తారక్ కు నెక్ట్స్ సీఏం అనే క్యాప్షన్ కూడా తగిలించారు. ఈ ప్లెక్సీ ఇప్పుడు చంద్రబాబుకు, లోకేష్ వరకు వెళ్లిందట. అయితే దీనిపై అంతా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ఆ ఫ్లెక్సీకి, తమ టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని.. టీడీపీ ఇంచార్జ్ చెబుతున్నారు. ఫ్లెక్సీ కోసం ఎవ్వరూ తమ అనుమతి తీసుకోలేదని, అది కచ్చితంగా ఎన్టీఆర్ అభిమానుల పని అని చెబుతున్నారు. మరి నిజంగా ఈ ప్లెక్సీ ఎవరు కట్టారో కానీ మీడియా లో , తెలుగుదేశం పార్టీ లో హాట్ టాపిక్ అయ్యింది.

Exit mobile version