Site icon TeluguMirchi.com

కన్నాను కలిశా…కానీ పార్టీ వీడనంటున్న మాజీ ఎమ్మెల్యే…!

పి.గన్నవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్టీలతో గేమ్స్ ఆడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా బీజేపీ చీఫ్ కన్నాలక్ష్మీనారాయణ తో  భేటీ అయి నియోజకవర్గంలో మళ్లీ చర్చకు తెర తీశారు….మొన్నటి ఎన్నికల నుంచి మూడు పార్టీల తలుపు తట్టాడు పులపర్తి నారాయణమూర్తి కానీ సరైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నారు. పి.గన్నవరం నుంచి 2014లో ఎన్నికైన నారాయణ మూర్తికి గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ నిరాకరించారు చంద్రబాబు. వెంటనే వైసీపీ వైపు చూశాడు…అనుకుందే తడువుగా తడవుగా ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ సభలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పదవి పై సరైన హామీ దొరక్కపోవడంతో అటు నుంచి సైడయ్యారు…

 

ఇక తర్వాత వంతు జనసేన. అక్కడ సరైన హామీ దక్కలేదు సీన్ రివర్స్ మళ్ళీ రావులపాలెం టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి టీడీపీలోనే ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే స్థానిక నాయకులతో సీటు విషయంలో వచ్చిన విభేదాలతో ఎన్నికల సమయంలో పార్లమెంట్‌ స్థాయిలో తప్ప నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి సైతం పాల్గొనలేదు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కన్నా ను ఆయన తనయుడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పులపర్తి రవికుమార్‌, రాష్ట్ర బీజేపి అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌తో కలిశారు. దీంతో నారాయణమూర్తి పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అక్కడా సరైన హామీ దక్కలేదేమో ఒక్క రోజు తర్వాత మళ్లీ తాను బీజేపీలో చేరడం లేదని వ్యక్తిగత పనులనిమిత్తం కలిశా అని చెప్పుకొచ్చారు. పులవర్తి దాటికి నియోజకవర్గంలో అన్ని పార్టీల కేడర్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారంటా…ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియక….

Exit mobile version