కృష్ణాజిల్లా : పార్టీ కేంద్ర కార్యాలయంపై, పార్టీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధితుల్నే దోషులుగా చిత్రీకరిస్తున్న జగన్ ప్రభుత్వం, వెంటనే దాడికి పాల్పడ్డ దేవినేని అవినాశ్ అనుచరుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్లు విజయవాడలోని టీడీపీ కృష్ణాజిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు.
వైసీపీ అనుబంధ సంస్థలాగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని విమర్శించారు, రాష్ట్ర ప్రజల్లో పోలీసుల మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి టీడీపీ వ్యవస్థాపక నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ భౌతిక కాయానికి తూట్లు పొడిచినట్లే, నెహ్రూ గారి అనుచరులు చేసిన అమానుష చర్యకు నెహ్రూ గారి ఆత్మ క్షోభిస్తుంది, నెహ్రూ గారు ఈనాటికీ తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఆయన పార్టీలో ఉండగా జెండా కప్పుకుని దివంగతులయ్యారు.
వైఎస్సార్‌సీపీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చటం నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి వరకు ప్రతీ సంఘటనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలమీద రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది, మీరు జిల్లాకో పీకేను తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా అధికారంలోకి రావడం కల్లా.. మీ నవరత్నాలు వల్ల ఆ నవ సీట్లు మాత్రమే మిగుల్తాయి
జగన్ ప్రభుత్వంలో బాధితుల్నే దోషులుగా చూపిస్తున్నారు దాడిని ఖండిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు గారు 36 గంటల నిరసన దీక్షకు రాష్ట్రంలో నలువైపులా నుండి ప్రజలు, పార్టీ శ్రేణులు రావటం చూసి అధికార పార్టీలో వణుకు మొదలైంది, దాడి చేయటమే కాకుండా వైసీపీ ప్రభుత్వం జానాగ్రహ దీక్షల పేరిట కపట నాటకం మొదలెట్టిందని, మీ జనాగ్రహ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, ఇలాంటి బూటకపు దీక్షలు మానుకోవాలని హితవు పలికారు.