Site icon TeluguMirchi.com

చంద్రబాబు పార్క్ కు వైఎస్ పేరు పెడతారా..!

 

ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ నేతలు.. కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేమంటే.. విశాఖపట్నం సౌత్ లో ఉన్న సెంట్రల్ పార్కు పేరును వైఎస్సార్ పార్కుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగడాలు తీసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో.. కోట్ల రూపాయలు వెచ్చించి.. కష్టపడి ఈ పార్కును నిర్మించారని టీడీపీ నేతలు ఈ సందర్భంగా వెల్లడిస్తూ ఆందోళనకు దిగారు.
అదేవిధంగా నేతలు.. కార్యకర్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు కట్టిన పార్కుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎలా పెడతారని నిలదీశారు? సెంట్రల్ పార్కుకు వైఎస్ పేరు కొనసాగిస్తామంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనేంతవరకు తాము ఉద్యమిస్తామని కూడా స్పష్టం చేశారు. విశాఖలో సెంట్రల్ పార్కు పేరును వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కుగా మార్చారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ కొత్తపేరుతో ఉన్న శిలాఫలకాన్ని రూపొందించి ప్రారంభించారు. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ వర్ధంతి నాటికి పార్కులో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు  వివరించారు.

Exit mobile version