పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యంగ స్పూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో రాగ ద్వేషాలకు అతీతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయన్నారు. అధికార వైసిపికి ఏకగ్రీవాలు, బలవంతపు ఉపసంహరణలు కావాలన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు