తెదేపా ’నగర పాలనకు నవ రత్నాలు’

tdpమున్సిపల్ ఎన్నికలకు తెదేపా సన్నద్ధం అవుతోంది. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళికను సైతం సిద్ధం చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే’నగర పాలనకు నవ రత్నాలు’ పేరిట తొమ్మిది అంశాల్లో ప్రజలకు సేవ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తెదేపా మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక వివరాలు :
* ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి ఇంటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ అందచేయడం.
* పేదలకు ఉచితంగా తాగునీరు
* కార్మికులు, చిరు ఉద్యోగులకు అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పటు
* ఎన్టీఆర్ క్యాంటీన్లలో ఒక్క రూపాయికే అల్పాహారం, రూ. 5కే బోజనం
* ప్రతి ఇంటికి ఉద్యోగం-ప్రతి కుటుంబానికి సొంతిల్లు
* ఆరోగ్యాన్ని ఒక్క హక్కుగా పరిగణించి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం పేరుతో అందరికీ చికిత్స