Site icon TeluguMirchi.com

ఏపీ 100రోజుల ప్రణాళిక!

AP(1)లక్ష్యాలను నిర్దేశించుకొని అభివృద్ధిలో దూసుకుపోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. శాఖల వారీగా 100రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకొంటుంది. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి 100రోజుల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు వీలుగా ప్రణాఌకను రూపొందించినట్లు తెలిపారు.

కేఈ కృష్ణమూర్తి 100రోజుల ప్రణాళికలోని ముఖ్యాంశాలు :
* రెవెన్యూ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రణాఌక రూపొందించడం
* రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మధ్య భూమి రేట్లు ఒకేలా వుండేలా చూడటం
* మీ సేవా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృత సేవలందివ్వడం
* కుల ధృవీకరణ ప్రత్రాల జారీని సరళీకృతం చేయడం
* రాయల సీమను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేయడం
* విశాఖ, విజయవాడ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు
రానున్న 100రోజుల్లో పైన పేర్కొన అంశాలపై దృష్టి సారించినున్నట్లు కేఈ తెలిపారు. అదేవిధంగా… మిగితా అన్ని శాఖలు కూడా 100రోజుల ప్రణాఌకను రూపొందించుకొని ముందుకెళ్లాలని తెదేపా అధినేత అన్ని శాఖల మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

Exit mobile version