Site icon TeluguMirchi.com

కొనసాగుతున్న టీ-బంద్!

telangana bandhతెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. పాఠశాలలు, వస్త్ర-వాణిజ్య వ్యాపారులు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరితమయ్యాయి. తెలంగాణలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో విద్యార్థులు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చేస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా తెరాస అధినేత కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మొదటి నుంచి రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్న టీ-జేఏసీ నేతలు, భాజపా శ్రేణులు సైతం బంద్ లో పాల్గొంటున్నారు. రాయల ’టీ’ ప్రతిపాదనను వెనక్కు తీసుకోనట్లయితే.. మరో యుద్దానికి సిద్దమని ఇప్పటికే తెరాస శ్రేణులు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వారు ఈరోజు మరోమారు సమావేశమయి భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే్ విభజన నివేదిక సిద్ధమైంది జీవోఎం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు నివేదికను తీసుకురానున్నారు. అయితే, అది పన్నెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనా.. ? లేక పది జిల్లాలతో కూడిన తెలంగాణనా.. ? అన్నదానిపై మాత్రం మంత్రుల బృందంలోని ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేక పోవడం కాస్త విచారించాల్సిన విషయమే. దీంతో.. ఎవరికి తోచినట్లువారు.. ’రాయల తెలంగాణ’ అని.. లేదు.. పదిజిల్లాలతో కూడిన ’తెలంగాణ’నే నని అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.. విభజన బిల్లు, ముసాయిదా తీర్మానం రెండు కూడా కేబినేట్ ముందుకు టేబుల్ ఐటమ్ గానే రానున్నాయి.

జీవోఎం ఇప్పటికే రాయల ’టీ’ ని ఖరారు చేసిందనే వార్తలొస్తున్నాయి. జీవోఎం ప్రతిపాదనపై ఇటు తెరాస, అటు బీజేపీ లు మళ్లీ ఉద్యమ బాట పట్టాయి. మరీ.. ఆయా పార్టీల ఉద్యమాలకు తలొగ్గి పది జిల్లాలతో కూడిన తెలంగాణకే కేబినేట్ ఓటేస్తుందా.. ? లేదా జీవోఎం ప్రతిపాదించినట్లుగా రాయల ‘టీ’కే సై అంటుందా.. ? అనేది వేచి చూడాలి.

Exit mobile version