Site icon TeluguMirchi.com

టార్గెట్ ’వైసీపీ’.. !!

ysrcpశాసనసభలో ’టీ’-బిల్లుపై చర్చ మొదలైందా.. ? లేదా.. ? అనే సంగ్దితకు తెరపడింది. టీ-బిల్లుపై శ్రీధర్ బాబు చర్చను మొదలు పెట్టారా.. ? లేదా.. ? అనే ఆలోచనలు పక్కకు పెట్టినా.. తాజాగా నిన్న(బుధవారం) మంత్రి వట్టి వసంత కుమార్ చర్చను స్టార్ట్ చేశారు. అయితే, ఇప్పుడు అందరూ.. వైసీపీనే టార్గెట్ చేశారు. శాసనసభలో సమైక్య తీర్మాణం చేయాలనే పేరుతో ఇన్నాళ్లు సభలో టీ-బిల్లుపై చర్చించకుండా చేసింది జగన్ పార్టీనే.

సమైక్యవాదంతో.. సీమాంధ్రలో సూపర్ గా దూసుకుపోదామనుకున్న జగన్ ప్లాన్ పై జెండా, అజెండా లు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా దాడికి దిగాయి. అసలు సమైక్య ముసుగులో విభజనకు సంపూర్ణంగా సహకరిస్తున్న ఏకైక పార్టీ వైకాపానే అని నేతలు గగ్గోలు పెడుతున్నారు. అదేలా అంటే.. సమైక్య తీర్మాణంపై పట్టుబట్టి సభను నడవకుండా చేస్తే.. స్వీకర్ సభ నుండి సస్పెండ్ చేస్తారు. ఇక అటుపిమ్మట సమైక్యం కోసం పోరాడితే.. సభ నుండి సస్పెండ్ చేశారని సీమాంధ్రలో సీన్ క్రియేట్ చేయాలన్నది వైకాపా నేతల ప్లాన్. అయితే.. ఇందులో లోగడ దాగున్న అసలైన ప్లాన్ మాత్రం విభజనకు సహకరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శాసన సభ నుంచి వైకాపా ఎమ్మెల్యేలు సస్పెండ్ అయితే.. సమైక్యం కోరుకునే సభ్యుల సంఖ్య తగ్గుతోంది. దీంతో.. టీ-బిల్లుపై ఓటింగ్ పెట్టినా… సమైక్యం వాదం గెలవకపోవచ్చు. వైకాపా నేతలు సస్పెండ్ కావడం, కాంగ్రెస్ లోని అధిష్టానానికి భజన చేసే నేతలు విభజనకు అనుకూలంగా వ్యవహరించడం.. తదితరల కారణాల వల్ల సభలో విభజన వాదులదే మెజారిటీ అయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం సూచనతోనే వైకాపా ఈ రకమైన ధోరణిని అనుసరిస్తుందని తెదేపా ఆరోపిస్తోంది. తెదేపా వాదనను సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే కాకుండా.. సమైక్యాన్ని కోరుకోనే ప్రతిఒక్కరు సమర్థిస్తున్నట్లు సమాచారమ్.

ఈ నేపథ్యంలోనే.. సమైక్యవాదాన్ని కోరుకునే ప్రతినేత టార్గెట్ వైసీపీ అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, తెదేపా నేతలు వైకాపా వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైకాపా నిజంగానే సమైక్యాన్ని కోరుకుంటే.. టీ-బిల్లుపై జరిగే చర్చకు సహకరించాలని సూచిస్తున్నారు. అప్పుడే సమాంధ్రకు న్యాయం చేసిన వాళ్లమవుతామని వారు చెబుతున్నారు. ఇక, ఏపీ ఎన్జీవోలు సైతం వైకాపానే టార్గెట్ చేశాయి. మూకుమ్మడి దాడితో వైకాపా ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో.. వైకాపా టీ-బిల్లుపై చర్చకు సహకరిస్తుందా.. ? లేదా ఎవరెన్ని ఆరోపిస్తే.. ఏంటీ.. స్వలాభమే ముఖ్యమని తమ సొంత అజెండాను అనుసరిస్తుందా.. ? అని వేచి చూడాలి..

Exit mobile version