కేసీఆర్ భరతం పడతాం!

target-kcr

తెరాస అధినేత కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు ప్రత్యర్థి పార్టీ నేతలు. తెరాసపై తెదేపా ఎప్పటి నుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇన్నాళ్లు మిత్రపక్షంగా మెలిగిన కాంగ్రెస్ టార్గెట్ కేసీఆర్ అంటోంది. కాంగ్రెస్ లో తెరాసను విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇటీవలే టీ-పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పొన్నాల కేసీఆర్ భరతం పడతామని హెచ్చరించారు. నిన్న (సోమవారం) పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. తెరాసకు ఘూటైన హెచ్చరికలు జారీచేశారు. అబద్దాల పునాదులు, కుట్ర, నమ్మక ద్రోహాలతో కేసీఆర్ తెరాసను నిర్మించాడని దుయ్యబట్టారు. ముందుంది ముసళ్ల పండగని ధ్వజమెత్తారు.

అమరవీరులను అనుమానిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెబుతారని పొన్నాల హెచ్చరించారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, లోక్ సత్తా, జనసేన.. ప్రతి పార్టీ టార్గెట్ కేసీఆర్ అంటున్నాయి. పార్టీల మూకుమ్మడి దాడితో తెరాస ఉక్కిరిబిక్కి అవుతోంది. ఎస్.సి ని సీఎం చేయడం, మైనారిటీని ఉపముఖ్యమంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీపై.. ఇప్పుడు సమాధానం చెప్పలేక కామ్ గా వుంటున్నాడు గులాభి అధినేత.